బాపూ, శాస్ర్తిలకు ప్రధాని మోదీ నివాళులు

PM Modi pays tribute to Bapu and Shastri

Oct 2, 2024 - 13:39
Oct 2, 2024 - 13:40
 0
బాపూ, శాస్ర్తిలకు ప్రధాని మోదీ నివాళులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సత్యం, సామరస్యం, సమానత్వం మహాత్మాగాంధీ ఆదర్శరాలను ప్రపంచానికి చాటుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం మహాత్మాగాంధీ 155వ, లాల్ బహదూర్ శాస్ర్తిల జయంతి సందర్భంగా న్యూ ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..బాపూజీ జీవితం ఆదర్శాలు, ఉన్నత సిద్ధాంతాలతో ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయింది. వలసవాద బ్రిటిస్ పాలనకు వ్యతిరేకంగా ఆయన స్వాతంత్ర్య పోరాటం చరిత్ర ఎన్నటికీ మరవదన్నారు. చివరకు ఆయన ఆశయాలు నెరవేరి భారత్‌కు స్వాతంత్ర్యం సమకూరి ఉంది. 
 
జై జవాన్ జై కిసాన్, జై స్వాభిమాన్ ల కోసం లాల్ బహదూర్ శాస్ర్తి తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని కొనియాడారు. శాస్ర్తి దూరదృష్టి గ వ్యక్తి అని కొనియాడారు. పాక్ తో శాస్ర్తి చేసుకున్న తాష్కెంట్ ఒప్పందాన్ని గుర్తు చేశారు. ఇరువురు మహానీయుల జీవితాలు ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి సేవలను కొనియాడారు.