పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్​ ముగ్గురు మృతి

Three killed in helicopter crash in Pune

Oct 2, 2024 - 13:44
 0
పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్​ ముగ్గురు మృతి

పూణే: పూణేలోని బవ్​ ధాన్​ కు సమీపంలో హెరిటేజ్​ ఏవియేషన్​ కు చెందిన హెలికాప్టర్​ బుధవారం ఉదయం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లుగా అగ్నిమాపక ఉన్నతాధికారి దేవేంద్ర ప్రభాకర్​ తెలిపారు.  ఆక్స్​ ఫర్డ్​ హెలిప్యాడ్​ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం అందిందన్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. నాలుగు అగ్నిమాపక వాహనాలతో రెస్క్యూ చర్యలు చేపట్టామన్నారు. ఘటనా స్థలంలో విమానం భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తెలిపారు. పోలీసులకు, ఏయిర్ ఫోర్స్​ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందజేశామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు, ఒక ఇంజనీర్​ మరణించారని తెలిపారు. 

ప్రమాదంపై చించ్వాడ్​ డీసీపీ విశాల్​ గైక్వాడ్​ మాట్లాడుతూ.. ఈ హెలికాప్టర్​ బుధవారం ఉదయం బవ్​ ధాన్​ నుంచి బయలుదేరిందని జుహుకు వెళ్లాల్సి ఉందన్నారు. బయలుదేరిన కొద్దిసేపటికే క్రాష్​ జరిగిందన్నారు. సమాచారం అందిన వెంటనే సహాయక చర్యల కోసం రంగంలోకి దిగామన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తివివరాలను ఆరా తీస్తున్నామని డీసీపీ తెలిపారు.