మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. రూ. 387 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
Mahadev betting app case.. Rs. ED attached 387 crore assets
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ రూ. 387 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. శనివారం ఆస్తులను అటాచ్ చేసిన విషయాన్ని ప్రకటన మాధ్యమంగా వెల్లడించింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్. ఈ యాప్ ద్వారా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా లబ్ధి పొందారు. యాప్ వెనుక రాజకీయ నాయకులు, అధికారులు, బాలీవుడ్ ప్రముఖుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఆస్తులను అటాచ్ చేస్తూ ఆర్డర్ ను జారీ చేసింది. అటాచ్ చేసిన ఆస్తులు చత్తీస్ గఢ్, ముంబై, మధ్యప్రదేశ్, మారిషస్ లో ఉన్నాయి. ఈడీ విచారణలో సిండికేట్ ద్వారా ఈ బెట్టింగ్ లు నిర్వహించినట్లు తేలింది. ఇప్పటివరకే ఈ కేసులో ర. 2వేల కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేశారు. బ్యాంకు, సెక్యూరిటీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ రూ. 1729.17 కోట్లుగా ఉంది. ఈ కేసులో ఇప్పటివరకూ 11 మందిని ఈడీ అరెస్టు చేసింది.