టాటా గ్రూప్​ చైర్మన్​ గా నోయెల్​ టాటా

డైరెక్టర్ల సమావేశంలో ఎన్నిక

Oct 11, 2024 - 14:09
 0
టాటా గ్రూప్​ చైర్మన్​ గా నోయెల్​ టాటా
ముంబాయి: టాటా గ్రూప్​ చైర్మన్​ గా నోయెల్​ టాటా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి టాటా సంస్థల డైరెక్టర్ల సమావేశం ముంబాయిలో జరిగింది. ఈ సమావేశంలో నోయెల్​ టాటాను చైర్మన్​ గా ఎన్నుకున్నారు. రతన్​ టాటా తరువాత సంస్థల్లో అతిపెద్ద వాటాదారుగా నోయెల్​ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ల సమావేశంలో ఆయన ఎన్నిక సులువైంది. నోయెల్​ టాటా ఇప్పటికే దొరాబ్జీ టాటా ట్రస్ట్​, సర్​ రతన్​ టాటా ట్రస్ట్​ లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. 
 
సైమన్​ టాటా కుమారుడు నోయెల్​ టాటా, ఇన్వెస్టిమెంట్​, స్టీల్​, ఇంటర్నేషనల్​, ట్రస్టులలో టాటా గ్రూపు బోర్డులో ఉన్నారు. ఆయా సంస్థల్లో టాటా ట్రస్ట్​  వాటా రూ. 13.8 లక్షల కోట్లు 66 శాతం.
 
టాటా ట్రస్ట్​ 66 శాతం, ఇతరులు 2.6 శాతం, సైరస్​ మిస్ర్తీ కుటుంబం 18.4 శాతం, టాటా గ్రూప్​ సంస్థ 13 శాతం వాటాను కలిగి ఉంది. రతన్​ టాటా సోదరుడు జిమ్మీ టాటావయోభారం కారణంగా వ్యాపారాలకు దూరంగా ఉన్నాడు. ముంబాయిలోని కేవలం రెండు గదుల ఇంటిలో సాదాసీదా జీవనం గడుపుతున్నాడు.