జియోకు అత్యధిక కస్టమర్లు 48.18కోట్ల మంది సబ్ స్క్రైబర్లతో రికార్డు
Jios-record-in-the-highest-number-of-customers-in-the-world
ప్రపంచంలోనే తొలి టెలికామ్ సంస్థగా రిలయన్స్ రికార్డు
ముంబై: ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చైనా సంస్థలను రిలయన్స్ తోసిరాజేస్తోంది. ఇటీవల రియలన్స్ త్రైమాసిక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికను బుధవారం మీడియాతో పంచుకుంది. దీని ప్రకారం జియోకు 48 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఈ సంఖ్య కాస్త ప్రపంచంలోనే దేశంలోని ఒకే టెలికామ్ సంస్థకు లేకపోవడం విశేషం.
దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ గా జియో అవతరించింది. 2016లో జియో టెలికామ్ సేవలను ప్రారంభించింది. కేవలం ఎనిమిదేళ్లలోనే కోట్లాది వినియోగదారులను సంస్థ సొంతం చేసుకుంది. దేశంలోనే ఏ సంస్థలు ఇవ్వనంత చౌక ప్లాన్ లతో వినియోగదారులను ఆకర్షించింది. ప్రకటన ప్రకారం మార్చి 2024 నాటికి జియో 481.8 మిలియన్ (48.18 కోట్లు)మంది వినియోగదారులున్నారు. ఇందులో 10.8 కోట్ల మంది 5జీని వినియోగిస్తున్నారు. జియో 4జీ, 5జీ సేవలను దేశవ్యాప్తంగా అందిస్తోంది. అంతర్జాతీయంగానే గాకుండా దేశీయ సంస్థలను కూడా జియో వెనక్కు ఎప్పుడో నెట్టేసింది.