అమేథీలో రాహుల్ కు షాక్..
కీలక నేత వికాస్ బీజేపీలో చేరిక
అమేథీ: ఎన్నికలకు ముందు అమేథీ స్థానంలో కాంగ్రెస్ (రాహుల్ గాంధీకి) షాక్ తగిలింది. అమేథీలో రాహుల్ కు కీలక నేతగా పేరున్న వికాస్ అగ్రహరి గురువారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సమక్షంలో వికాస్ బీజేపీలో చేరారు. వికాస్ అగ్రహరి జగదీష్‌పూర్ నివాసి. కాంగ్రెస్ అతన్ని రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా చేసింది. రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో వికాస్ అగ్రహారి ఒకరుగా చెబుతుంటారు. స్మృతి ఇరానీ ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ దేశానికి చేస్తున్న మేలును దృష్టిలో పెట్టుకొని బీజేపీలో చేరుతున్నట్లు వికాస్ ప్రకటించారు. దీంతో అమేథీలో స్థానికంగా మంచి పట్టున్న నేతను కాంగ్రెస్ కోల్పోయినట్లయ్యింది. దీని ప్రభావం ఎన్నికల్లో ఉండనుందనే వాదనలున్నాయి.