ట్రైనీ వైద్యుడి పరిస్థితి విషమం

The condition of the trainee doctor is critical

Oct 11, 2024 - 13:55
 0
ట్రైనీ వైద్యుడి పరిస్థితి విషమం

డిమాండ్ల సాధనకు కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్ష
ఆర్జీకర్​ సీసీయూలో చికిత్స

కోల్​ కతా: కోల్​ కతాలోని ఆర్జీకర్​ ట్రైనీ వైద్యుల నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఓ వైద్యుడి పరిస్థితి విషమించడంతో అతన్ని పోలీసులు బలవంతంగా క్రిటికల్​ కేర్​ యూనిట్​ లో చేర్చి చికిత్స అందజేస్తున్నారు. ఆసుపత్రి ఇన్​ చార్జీ డా. సోమా ముఖోపాధ్యాయ మాట్లాడుతూ.. ట్రైనీ వైద్యుడు అనికేత్​ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆసుపత్రి సీసీయూలో అతనికి చికిత్సనందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందన్నారు. అనికేత్​ ఆహారం, నీరు తీసుకోకపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించిందన్నారు. ఐదుగురు వైద్యుల బృందం అతనికి చికిత్సనందిస్తుందని సోమా తెలిపారు. 

ట్రైనీ వైద్యుడు దేబాశిష్​ మాట్లాడుతూ.. మరో ఆరుగురు వైద్యుల ఆరోగ్య పరిస్థితులు కూడా ఏం బాగాలేవన్నారు. ప్రభుత్వం ట్రైనీ విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చడంలో విఫలం కావడంతో మరోమారు ఏడుగురు వైద్యులు 6 అక్టోబర్​ నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.