బీరూట్ లో ఐడీఎఫ్ దాడులు
22మంది మృతి, 177 మందికి గాయాలు
బీరూట్: లెబనాన్ లోని బీరూట్ లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భారీ దాడులు కొనసాగిస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున గగనతలం నుంచి జరిపిన దాడిలో 22 మంది మృతి చెందగా, 177 మందికి గాయాలయ్యాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ భవనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ దాడిపై ఐడీఎఫ్ ధృవీకరించలేదు. హిజ్బుల్లా కో ఆర్డినేషన్ చీఫ్ వాఫిక్ సఫానే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులకు పాల్పడింది. ఇప్పటివరకూ సెంట్రల్ బీరూట్ లో ఇదే అత్యంత పెద్ద దాడిగా అభివర్ణిస్తున్నారు. ఈ దాడిలో యూఎన్ శాంతి పరిరక్షక సభ్యులు కూడా గాయపడ్డారు. ఐడీఎఫ్ తమను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతుందని యూఎన్ ఆరోపించింది. తమ శాంతి దళాలు వెళ్లాల్సిందిగా ఐడీఎఫ్ హెచ్చరికలు జారీ చేసిందన్నారు.
ఈ దాడిపై ఇటలీ, ఫ్రాన్స్, ఇండోనేషియాతో సహా అనేక దేశాలు ఇజ్రాయెల్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ చమురు నిల్వలను లక్ష్యం చేసుకునే అవకాశం ఉందన్న వార్తలతో సౌదీ, ఖతార్, యూఏఈ దాడులను ఆపాలని అమెరికాపై ఒత్తిడిని పెంచుతున్నాయి.