బెంగళూరు: కర్ణాటకలో సీబీఐ దర్యాప్తునకు సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇక నుంచి ఆ రాష్ర్టంలో ప్రభుత్వ అనుమతి లేనిదే సీబీఐ దర్యాప్తు జరగకూడదని నిర్ణయించింది. ముడా కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సిద్ధరామయ్య కేబినెట్ లో రాష్ర్ట న్యాయశాఖ మంత్రి హెచ్ కే పాటిల్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ర్ట అనుమతి లేనిదే కర్ణాటకలో సీబీఐ ప్రవేశించడానికి వీలు లేదన్నారు.
రాష్ట్రంలో సీబీఐ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. సీబీఐ ఇప్పటివరకూ చార్జీషీట్లు దాఖలు చేయలేదన్నారు. పక్షపాత ధోరణితో విచారణ కొనసాగుతోందని ఆరోపించారు. ముడా స్కామ్ పై తాము నిర్ణయం తీసుకోలేదన్నారు.
మరోవైపు కర్ణాటకలో సీబీఐ దర్యాప్తుపై ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ దర్యాప్తులపై పలు ప్రశ్నలు, ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలను వేధించేందుకే సీబీఐ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.