12 ప్రాంతాల్లో ఎన్ ఐఏ సోదాలు
మావోనెట్ వర్క్ ను అడ్డుకునేందుకు ప్రయత్నం సోదాల్లో కీలక పత్రాలు లభ్యం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా, అసన్సోల్ సహా 12 ప్రాంతాల్లో ఎన్ ఐఏ భారీ ఎత్తున దాడులకు దిగి సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాలు మావోయిస్టుల నెట్ వర్క్, వారికి అందుతున్న ఆర్థిక సహకారం అడ్డుకునేందుకు అని మంగళవారం సోదాలు నిర్వహిస్తున్న ఎన ఐఏ అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో మావోలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం కూడా లభించినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో పానిహత, బరాక్ పూర్, సోదేపూర్ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. మావోయిస్టులకు డబ్బులు పంపినట్లుగా ఇద్దరు మహిళలు ఎన్ఐఏ అనుమానిత లిస్టులో ఉన్నారు. దీంతో మావోలు నెట్ వర్క్ పరిధిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని తేటతెల్లం అవుతోందని, ఆర్థిక నెట్ వర్క్ ను విచ్ఛిన్నం చేయాలనే దిశగా కేంద్రం ఎన్ ఐఏను రంగంలోకి దింపింది. ఈ దాడుల్లో భారీ మావో గ్రూపునకు సంబంధించిన సమాచారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నందున ఇప్పుడప్పుడే వివరాలను అందించలేమన్నారు.