సీఎంకు పిచ్చి ముదిరింది!

టెర్రరిస్ట్​ అనడంపై ఎంపీ ప్రహ్లాద్​ జోషి ఫైర్​ దాడులకు పాల్పడిన మైనార్టీలపై కేసులు ఎలా ఎత్తివేస్తారని నిలదీత సీఎం సిద్ధరామయ్యలో పెరుగుతున్న అభద్రతా భావం

Oct 13, 2024 - 20:03
 0
సీఎంకు పిచ్చి ముదిరింది!

బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ ఫైర్​ అయింది. ఆదివారం బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ తనను టెర్రరిస్ట్​ అనడం పట్ల సీఎంకు పిచ్చి ముదిరిందని ఆయనకు మెంటల్​ ట్రీట్​ మెంట్​ అవసరమని అన్నారు. హుబ్లీ అల్లర్లలో నింఇతులైన మైనార్టీ వ్యక్తులపై కేసులు ఎలా విత్​ డ్రా చేసుకుంటారి నిలదీశారు. కేసుల ఉపసంహరణ విషయం కోర్టు ముందుకు వెళుతుందన్నారు. మైనార్టీ వర్గాలను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా వారు చేసిన అరాచకాలను ప్రోత్సహించినట్లవుతుందన్నారు. సిద్ధరామయ్య నిజంగా బాధతో ఉన్నట్లు అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఆయనకు పదవి పోతుందేమోనన్న అభద్రతా భావం వెంటాడుతుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిందితులను వదలరాదని కఠినంగా శిక్షించాలని ప్రహ్లాద్​ జోషి డిమాండ్​ చేశారు.