దానంపై అనర్హత వేటు హైకోర్టులో పిటిషన్ దాఖలు
ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా ఉండి, మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్టవిరుద్ధమని ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని తెలంగాణ హై కోర్టులో పిటిషన్దాఖలైంది.
నా తెలంగాణ, హైదరాబాద్: ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా ఉండి, మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్టవిరుద్ధమని ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం దాఖలైన ఈ పిటిషన్‌ను గురువారం హైకోర్టు విచారించే అవకాశం ఉంది. పిటిషన్‌ను రాజు యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేశారు. దానంపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కూడా పిటిషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేశారు రాజు యాదవ్ తన పిటిషన్‌పై కోర్టుకు విజ్ఞప్తి చేశారు.