ఆ పార్టీలకు ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు

కాంగ్రెస్​, బీఆర్ఎస్​పై విమర్శనాస్త్రాలు సంధించిన ఈటల రాజేందర్​ కుత్బుల్లాపూర్​, నిజాంపేట పర్యటించిన మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ మళ్లీ దేశంలో మోదీయే ప్రధాని కాబోతున్నరు మోదీ నాయకత్వంలో భారత్​ బలమైన దేశంగా గుర్తింపు ఓటు హక్కులేని ప్రతిఒక్కరూ ఓటును నమోదు చేసుకోలి

Mar 29, 2024 - 19:02
 0
ఆ పార్టీలకు ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు

నా తెలంగాణ, హైదరాబాద్ : దేశంలో మళ్ళీ ప్రధానిగా మోదీ యే కాబోతున్నారని, కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ లో పలు కాలనీలు పార్కులలో ప్రజలను కలిసి శుక్రవారం ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారత దేశం మోదీ నాయకత్వంలో బలమైన దేశంగా ప్రపంచంలో గుర్తింపు పొందుతోందని తెలిపారు.ప్రధానమంత్రి మోదీ ఈ సారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కీ 370 సీట్లు రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అందులో మల్కాజిగిరి ఎంపీ సీటు ఒకటి అయ్యేలా ప్రతి ఓటరు ఆలోచించాలని కోరారు. ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకుని రాబోవు ఎన్నికల్లో కమలం పువ్వుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు ఈటల విజ్ఞప్తి చేశారు. నిజాంపేట్ పర్యటనలో భాగంగా ఈటల రాజేందర్ టీడీపీ సీనియర్ నాయకుడు లీడర్ నర్సింహ్మ రెడ్డిని కలిసి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. నిజాంపేట్ లోని శ్రీరాములుకుంట పార్క్, శ్రీనివాస్ నగర్ కాలనీ పార్క్ వాకర్స్ ను కలవడం తో పాటు టిఫిన్ మీటింగ్ లో ప్రజలను కలిసి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న దేశం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్, బీజేపీ నాయకులు సులోచన, నాగరాజు, కృష్ణ, భిక్షపతి యాదవ్, సుమన్ రావు, కౌశిక్ నాయుడు, జగదీష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు