అసోం, అరుణాచల్​ లకు బైబై చెప్పిన నెహ్రూ

ఒక్క అంగుళం ఆక్రమించనీయం కాంగ్రెస్​, కూటమి పార్టీలను ప్రజలు ఉపేక్షించరు లఖింపూర్​ ఎన్నికల సభలో కాంగ్రెస్​ పై కేంద్రమంత్రి అమిత్​ షా ఫైర్​

Apr 9, 2024 - 17:46
 0
అసోం, అరుణాచల్​ లకు బైబై చెప్పిన నెహ్రూ

లఖింపూర్: 1962 చైనా దాడి సమయంలో మాజీ ప్రధాని జవహర్​ లాల్​ నెహ్రు అసోం, అరుణాచల్​ ప్రదేశ్​ లకు బైబై చెప్పిన విషయాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చి పోలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా పేర్కొన్నారు. కానీ నేడు మోదీ హయాంలో ఒక్క అంగుళం భూమిని కూడా చైనాను ఆక్రమించనీయబోమని స్పష్టం షా స్పష్టం చేశారు. మంగళవారం యూపీలోని లఖింపూర్​ లో జరిగిన ఎన్నికల సభలో అమిత్​ షా గత ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. మోదీ హయాంలో దేశం భద్రంగా ఉందని, ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక సరిహద్దుల్లో పటిష్ఠమైన భద్రత ద్వారా ఎంతో ప్రాధాన్యతనిచ్చే ప్రాంతాలను కాపాడుకోగలిగామని స్పష్టం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కాంగ్రెస్​ పార్టీ ఓ వైపు ఉందని, దేశ సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే పార్టీ మరోవైపు ఉందని అమిత్​ షా పేర్కొన్నారు. ఇక దేశ ప్రజలే నిర్ణయించుకునే సమయం ఆసన్నమైందన్నారు. తమ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమంతోపాటు దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 

రాబోయే రోజుల్లో అసోం కూడా ఇతర ప్రాంతాల మాదిరిగానే అభివృద్ధి చెందుతుందన్నారు. బంగ్లాదేశ్​ సరిహద్దును పటిష్ఠం చేయగలిగామని అమిత్​ షా తెలిపారు. రామ మందిర అంశాన్ని ఏళ్ల తరబడి నాన్చుడు ధోరణితో అన్ని వర్గాలను కాంగ్రెస్​ పార్టీ మభ్యపెట్టిందని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలను ఒప్పించి మరీ నాన్చుడు ధోరణికి చెక్​ పెట్టే చర్యలను తీసుకుందన్నారు. అయోధ్య మందిరం ప్రారంభంలో కూడా అనేక అడ్డంకులను కాంగ్రెస్​ సృష్టించిందన్నారు. ఇక దేశ ప్రజలు కాంగ్రెస్​, ఇండి కూటమి పార్టీలను ఉపేక్షించే పరిస్థితులు లేవన్నారు. మరోమారు మోదీ హ్యాట్రిక్​ ఖాయమని కేంద్రమంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు.