మహాలో సీట్ల పంపకం అసంతృప్తి జ్వాలల్లో హస్తం నేతలు
మహారాష్ట్ర ఎంవీఏ (మహావికాస్ అఘాడిలో)లో సీట్ల పంపకం తర్వాత ముంబై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి.
మహారాష్ట్ర: మహారాష్ట్ర ఎంవీఏ (మహావికాస్ అఘాడిలో)లో సీట్ల పంపకం తర్వాత ముంబై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. సీట్ల పంపకాల సందర్భంగా ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ గైర్హాజరయ్యారు. మంగళవారం ఎంవీఏలో సీట్ల పంపకాలను ప్రకటించారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఇండి కూటమి పార్టీలు. సీట్ల షేరింగ్ లో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే)కు అత్యధికంగా 21 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ కు 17, ఎన్సీపీ (శరద్ పవార్)కు 10 సీట్లు దక్కాయి. ఠాక్రే ముందు కాంగ్రెస్ హైకమాండ్ తలవంచడం ఏంటని దగ్గరి నాయకుల వద్ద వర్షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆమె పార్టీ వీడనున్నట్లు కూడా పలువురు నాయకులు గుసగుసలాడుతుండడం విశేషం. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రకటించిన సీట్లే అంతిమమని ఆ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిందేనని మరో కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే అన్నారు. అయితే పార్టీల చీలిక తరువాత ఎన్సీపీ, శివసేనలు తొలిసారిగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.