సంభాల్​ వివాదం.. విదేశీ బుల్లెట్​ సెల్స్​ లభ్యం

Sambhal dispute.. foreign bullet cells are available

Dec 3, 2024 - 19:24
 0
సంభాల్​ వివాదం.. విదేశీ బుల్లెట్​ సెల్స్​ లభ్యం

లక్నో: యూపీలోని సంభాల్​ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మంగళవారం పోలీసుల చేపట్టిన తనిఖీల్లో విదేశీ బుల్లెట్​ షెల్స్​ లభ్యమయ్యాయి. కాల్పుల్లో నిందితులు విదేశీ ఆయుధాలను ఉపయోగించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మసీదు ముందు రోడ్డు నుంచి ఈ ఐదు బుల్లెట్ల సెల్స్​ లభ్యమైనట్లు, డ్రెయిన్​ లో పడి ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు రెండు మిస్​ ఫైర్డ్​ క్యాట్రిడ్జీ ఇవి పాక్​ లో తయారైనవిగా గుర్తించారు. హింసలో 41 రౌండ్ల ఫైరింగ్​ జరిగిందని పోలీసులు తెలిపారు. సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు నిందితులు ప్రయత్నించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కేసులో సీవో సహా 10మంది పోలీసుల వాంగ్మూలాలను మేజిస్ర్టేట్​ నమోదు చేశారు.