అమేథీ వాద్రాకివ్వొద్దు

ప్రశాంత్​ భూషణ్​ వార్నింగ్​

Apr 9, 2024 - 17:26
 0
అమేథీ వాద్రాకివ్వొద్దు

న్యూఢిల్లీ: అమేథీ ఎంపీ టికెట్​ ను రాబర్ట్​ వాద్రాకు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు సీనియర్​ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ హెచ్చరించారు. ఆయనకు టికెట్​ ఇస్తే అది ఆత్మహత్యా సదృశ్యమేనని మండిపడ్డారు. అమేథీ స్థానాన్ని వాద్రాకు కేటాయించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు రావడంపై ప్రశాంత్​ భూషణ్​ మంగళవారం మీడియాతో మాట్లాడారు. అమేథీ స్థానం కాంగ్రెస్​ కు కంచుకోట లాంటిదన్నారు. అలాంటి స్థానాన్ని వాద్రాకు కేటాయిస్తే చేజేతులా నష్టపోతారని అన్నారు. అమేథీ స్థానాన్ని కాంగ్రెస్​ పార్టీ ఇంకా ఎవ్వరికీ కేటాయించలేదు. ఈ స్థానంపై రాబర్ట్​ వాద్రా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రశాంత్​ భూషణ్​ హెచ్చరికపై హస్తం పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అమేథీలో ఐదో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.