సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
లక్ష్యాలను ఎందుకు పూర్తి చేయడం లేదు
రుణాల లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారా?
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించొద్దని హెచ్చరిక
నా తెలంగాణ, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నిరుపేద సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా వాటి అమలు తీరులో తెలంగాణ నివేదిక ఎందుకు వెనుకబడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అధికారులను నిలదీశారు. శుక్రవారం కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన బేగంపేటలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, పలు విభాగాల అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ నమూనాని కేంద్ర ప్రభుత్వ పథకాలకు కొరత ఏ మాత్రం లేకున్నా, అనుకున్న లక్ష్యాలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని నిలదీశారు. అధికారులు, బ్యాంకర్ల మధ్య అసలు ఉన్న సమస్యలేంటో వివరించాలన్నారు. సంయుక్త సమస్యల వల్ల లబ్ధిదారులు ఎందుకు నష్టపోవాల్సి వస్తుందో సమగ్ర నివేదిక రూపంలో ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాలన్నారు. అవసరమైతే మరిన్ని నిధులను కేంద్రం నుంచి తీసుకుంటే తనదన్నారు. కానీ కేంద్రం ఇచ్చిన నిధులనే ఖర్చు చేయలేక చతికిలపడితే ఎలా? అని నిలదీశారు. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక అధికారులు నీళ్లు నమిలారు.
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఎంఎస్ ఎంఈ, ముద్ర, పీఎం గతి శక్తి, పీఎం ముద్రణ, విద్యారుణాలు తదితర పథకాలపై కేంద్రం నుంచి వచ్చిన నిధులను సమర్థవంతంగా ఖర్చు చేయలేక చేతులెత్తుతున్నారెందుకని మంత్రి కిషన్ రెడ్డి నిలదీశారు. కేంద్రం ఇస్తున్న లక్ష్యాలను పూర్తి చేయలేకపోతే, మరిన్ని నిధులు ఎలా తీసుకురావాలని ప్రశ్నించారు. అయినా ఏయే పథకాల అమలులో నిధులు, లబ్ధిదారులు, రుణాలు అందించిన వివరాలు, సమస్యలు ఏంటి? అధికారుల, బ్యాంకుల మధ్య సమన్వయ లోపం ఎందుకు? తదితర పూర్తి వివరాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్టు కూడా అందించాలని అధికారులను నియమించింది. నిరుపేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నీరుగార్చే ప్రయత్నం చేయవద్దన్నారు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించొద్దని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ పథకంలోనైనా ఏదైనా సమస్య తలెత్తితే తనకు వివరించాలని చెప్పారు. సమస్యలు, కేంద్ర ప్రభుత్వ నిధుల సమస్య, రైల్వే సమస్యల వంటి వాటి పరిష్కార బాధ్యత తనకు వదిలేయాలి. లక్ష్యాలను పూర్తిచేసే బాధ్యత మాత్రం అధికారులదేనన్నారు. 2018 నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ప్రభుత్వం నయాపైసా రాల్చలేదని మంత్రికి వివరించారు.
అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైందని దిగువ భాగంలో ఇంకా కొన్ని పనులు మరో మూడు నెలల్లో పూర్తవుతున్నాయని మంత్రికి అధికారులు వివరించారు. ఫ్లై ఓవర్ పూర్తి కాగా కింది భాగంలో చెత్త చెదారంతో ఎలా ప్రారంభమవుతుందని ప్రశ్నించారు. అంబర్ పేట్ తన నియోజకవర్గానికి వచ్చి ప్రాంతమని తాను రోజూ అక్కడి నుంచే వెళుతున్నానని ఎందుకు మరో మూడు నెలలు పడుతుందని అధికారులను నిలదీశారు. చెత్త చెదారాన్ని వెంటనే తొలగించి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.