ఎమ్మెల్సీ నాకొద్దు! అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

బుజ్జగించే పనిలో శ్రీధర్​ బాబు, భట్టి

Jun 25, 2024 - 13:40
 0
ఎమ్మెల్సీ నాకొద్దు! అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

నా తెలంగాణ, హైదరాబాద్​: ఎమ్మెల్సీ పదవి తనకొద్దని తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత ఎమ్మెల్సీజీవన్​ రెడ్డి అలకబూనారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యతనీయడం లేదనే మనస్థాపంతో జీవన్​ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మరోమారు సీనియర్​ నాయకులు మంత్రి శ్రీధర్​ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు మరోమారు ఆయనకు నచ్చజెప్పేందుకు బేగంపేటలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. జీవన్​ రెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారు. 

అదే సమయంలో తనకు పార్టీ మారే ఆలోచనే లేదని జీవన్​ రెడ్డి అన్నారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా బీఆర్​ఎస్​ నాయకుడు ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ ను పార్టీలో చేర్చుకోవడం పట్ల జీవన్​ రెడ్డి అలకబూనినట్లు తెలుస్తోంది.