మోస్తరు నుంచి భారీ వర్షాలు వాతావరణ కేంద్రం హెచ్చరిక
Weather Center warns of moderate to heavy rains
నా తెలంగాణ, హైదరాబాద్: ఆది, సోమవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల్లో చురుగ్గా కదలికలున్నాయని తెలిపింది. దీని ప్రభావం వల్ల ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
శనివారం నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట్, నారాయణ్ పేట్, మహబూబ్నగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లాలోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.