అమెరికా సీఐఏ చీఫ్​ గా కాష్​ పటేల్​?

భారతీయ సంతతి వారికి తొలి ప్రాధాన్యం

Nov 7, 2024 - 20:53
 0
అమెరికా సీఐఏ చీఫ్​ గా కాష్​ పటేల్​?

వాషింగ్టన్​ డీసీ: ట్రంప్​ అధికారంలో భారత సంతతికి చెందిన కాష్​ పటేల్​ కు సీఐఏ చీఫ్​ పదవి లభించే అవకాశం ఉంది. సీఐఏ చీఫ్​ పదవి రేసులో పటేల్​ తోపాటు వివేక్​ రామస్వామి, జిందాల్​ లు కూడా వరుసలో ఉన్నారు. వీరు ట్రంప్​ బృందం భారతీయుల్లో అతిముఖ్యలుగా ముద్రపడ్డారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్​ ట్రంప్​ కూడా వీరికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఒకవేళ కాష్​ పటేల్​ ను సీఐఏ చీఫ్​ గా ఎన్నిక చేసినా మరో ఇద్దరికి కూడా ట్రంప్​ మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. సీఐఏ చీఫ్​ పదవి రేసులో తొలివరుసలో భారతీయులే నియమించాలని ట్రంప్​ గతంలోనే నిర్ణయించినట్లు చెబుతారు. 

జో బైడెన్​ చేతిలో ఓడిపోయే ముందు ట్రంప్​ కాష్​ పటేల్​ నే సీఐఏ చీఫ్​ గా నియమించాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఆయన ప్రయత్నం ఫలించలేదు. 2023లో కూడా కాష్​ పటేల్​ ను ఉద్దేశిస్తూ సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ వ్యాఖ్యల ప్రకారం సీఐఏ చీఫ్​ గా కాష్​ పటేల్​ వైపే ట్రంప్​ మొగ్గు చూపుతున్నారని అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.