నవీన్​ పట్నాయక్​ రాజీనామా

బీజేపీ సీఎం ఎవరో?

Jun 5, 2024 - 16:00
 0
నవీన్​ పట్నాయక్​ రాజీనామా

భువనేశ్వర్​: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ తన పదవికి రాజీనామా సమర్పించారు. మంగళవారం బీజేడీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం  రాజ్​ భవన్​ లో  గవర్నర్​ రఘుబర్​ దాస్​ ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. బీజేపీకి 78 స్థానాలు లభించడంతో ఆ పార్టీ ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఒడిశా అసెంబ్లీలో 147 స్థానాలున్నాయి. బీజేడీకి 51 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక్కడి ఎన్నికల్లో మోదీ పేరుతో ప్రచారం నిర్వహించడంతో ప్రస్తుతం బీజేపీ సీఎంగా ఎవరిని ఎన్నుకుంటుందనే ఆసక్తి నెలకొంది. త్వరలో ఒడిశాలో బీజేపీ అధికారం చేపట్టనుంది.

కాగా నవీన్​ పట్నాయక్​ 24 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2000 మార్చి 5న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి 2019 వరకు ఐదుసార్లు ఒడిశా సీఎంగా ఉన్నారు.