బీజేపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం
అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక దళం ఆస్తి, ప్రాణ నష్టం లేదన్న అధికారులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ పంత్ మార్క్ లో బీజేపీ కార్యాలయంలో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక దళం మంటలను వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చింది. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మీటర్ బాక్సులో షాట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖాధికారులు గుర్తించారు. ప్రమాదంలో ఎలాంటి, ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదన్నారు. మంటలను చల్లార్చిన అధికారులు విద్యుత్ పునరుద్ధరణకు సమయం పడుతుందని పేర్కొన్నారు.