ఉక్రెయిన్​ కు అమెరికా భారీ సాయం 60 బిలియన్​ డాలర్లతో ఆయుధాలు అందజేత

పెంటగాన్​ లో ప్రకటించిన రక్షణ మంత్రి లాయిడ్​ ఆస్టిన్​

Apr 27, 2024 - 15:32
 0
ఉక్రెయిన్​ కు అమెరికా భారీ సాయం 60 బిలియన్​ డాలర్లతో ఆయుధాలు అందజేత

న్యూఢిల్లీ: అసలె ఉప్పునిప్పులా ఉన్న రష్యా–ఉక్రెయిన్​ మధ్యలో అమెరికా మరింత చిచ్చు రాజేసేలా ఉంది. రష్​యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్​ కు పేట్రియాట్​ క్షిపణి వ్యవస్థను అందజేస్తామని అమెరికా రక్షణ శాఖ శనివారం ప్రకటించారు. ఈ క్షిపణి వల్ల రష్యా వైమానిక దాడులను ఉక్రెయిన్​ అడ్డుకోగలుగుతుంది. ఈ సహాయం కింద ఉక్రెయిన్​ కు 60 బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు అందించిన సాయంలో ఇదే అతిపెద్ద సైనిక సహాయం అన్నారు. ఈ సహాయం వల్ల ఉక్రెయిన్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఇనిషియేటివ్ కింద అందిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ కు అమెరికా నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్స్, ఆధునిక ఆయుధాలు, గాలి నుండి భూమిపై వినియోగించే ఆయుధాలు అందనున్నాయి.