బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్​ ఎత్తివేత

పిటిషన్ ​పై 27న నిర్ణయం వెల్లడిస్తామన్న హైకోర్టు

Mar 6, 2024 - 20:10
 0
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్​ ఎత్తివేత

నా తెలంగాణ, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను హైకోర్టు బుధవారం రద్దు చేసింది. ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ ​పై ఈ నెల 27న నిర్ణయాన్ని వెలువరించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 15న ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా ప్రసంగిస్తున్న సమయంలో చెలరేగిన గందరగోళం సందర్భంగా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో మోహన్ సింగ్ బిష్త్, అజయ్ మహావార్, ఓపీ శర్మ, అభయ్ వర్మ, అనిల్ వాజ్‌పేయి, జితేంద్ర మహాజన్, విజేందర్ గుప్తాలు తమ సస్పెన్షన్​ పై హైకోర్టును ఆశ్రయించారు. విపక్ష సభ్యులను చర్చలో పాల్గొనకుండా చేసేందుకు దురుద్దేశపూరిత పథకం ప్రభుత్వం పన్నిందని పిటిషన్​లో ఆరోపించారు. ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది జయంత్ మెహతా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని, నిబంధనలకు విరుద్ధమని, విచారణలో పాల్గొనే వారి హక్కును ప్రభావితం చేస్తుందని వాదించారు. దీంతో కోర్టు వీరి వాదనతో ఏకీభవించి సస్పెన్షన్ ​ను ఎత్తివేసింది.