ముక్తార్​ అంత్యక్రియలు పూర్తి

పరారీలో భార్య, జైలులో కుమారుడు

Mar 30, 2024 - 17:20
 0
ముక్తార్​ అంత్యక్రియలు పూర్తి

లక్నో: మాఫియా డాన్, రాజకీయ నేతగా పేరొందిన ముక్తార్​ అన్సారీ అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. పోస్టుమార్టం అనంతరం రాత్రి ఒంటిగంటకు ముక్తార్ మృతదేహాన్ని మహమ్మదాబాద్​లోని ఆయన ఇంటివద్దకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముక్తార్​ కుమారుడు ఒకరు ఇప్పటికే జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. భార్య పరారీలో ఉంది. చిన్న కుమారుడు ఒమర్​ అన్సారీ ఆధ్వర్యంలో ఘాజీపూర్​లో అంత్యక్రియలు పూర్తయ్యాయి.  కాగా యూపీలో మాఫియాలుగా చెలమణి అవుతూ అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న అతీక్​ అహ్మాద్ ​గతేడాది నిందితులు జరిపిన కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే.