హైజాకైన ​బోటుకు విముక్తి

23 మంది పాక్​ జాతీయులు క్షేమం భారత నేవీ సాహసంపై ప్రపంచదేశాల హర్షం

Mar 30, 2024 - 17:21
 0
హైజాకైన ​బోటుకు విముక్తి

న్యూఢిల్లీ: సముద్రంలో హైజాక్​కు గురైన ఇరాన్​బోటును సముద్రపు దొంగల బారి నుంచి విముక్తి కల్పించి భారత నేవీ మరోసారి సత్తా చాటింది. ఈ బోటులో 23 మంది పాక్​ జాతీయులు ఉన్నారు. గురువారం ఈ బోటును అరేబియా సముద్రంలోని సోకోట్రా ద్వీప సమూహానికి 90 నాటికల్​ మైళ్ల దూరంలో తొమ్మిది మంది పైరెట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సమాచారం భారత నేవీకి అందింది. దీంతో బోటును, సిబ్బందిని కాపాడేందుకు ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టనున్నట్లు భారత​ నేవీ శుక్రవారం ప్రకటించింది. ఐఎన్ఎస్​ సుమేధా దొంగల ఆధీనంలో ఉన్న బోటును అడ్డంగించింది. అనంతరం త్రిశూల్​ నౌక రంగంలోకి దిగింది. ఈ ఆపరేషన్​ మొదలు పెట్టిన 12 గంటల్లో పైరెట్లు లొంగిపోయారు. ఇందులో ఉన్న 23 మంది పాక్​ జాతీయులు సురక్షితంగా ఉన్నట్లు భారత నేవీ ప్రకటించింది. పైరెట్లను అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది. భారత నేవీ సాహసంపై ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.