ధ్యాన దినోత్సవానికి ఉంగా ఆమోదం
ఓటు వేసిన 193 దేశాలు యూఎన్ లో భారత రాయబారి పర్వతనేని హర్షం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21న ప్రకటించాలన్న భారత్ ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్ జీఎ–ఉంగా)లో ఆమోదం లభించింది. అన్ని దేశాలు భారత ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు.భారత్, లీచ్టెన్ స్టెయిన్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండోరాలతో కలిసి భారత్ ఉంగాలో 193 మంది దేశా సభ్యుల ముందుంచింది. లీచ్టెన్ స్టెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బంగ్లాదేశ్, బల్గేరియా, బురుండి, డొమినికన్ రిపబ్లిక్, ఐస్‌లాండ్, లక్సెంబర్గ్, మారిషస్, మొనాకో, మంగోలియా, మొరాకో, పోర్చుగల్, స్లోవేనియాలు మద్ధతు తెలిపాయి. ఈ దేశాలు ప్రపంచ ధ్యాన దినోత్సవ నిర్వహణకు స్పాన్సర్ చేయనున్నాయి. ఈ సందర్భంగా యూఎన్ లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ.. భారత్ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించడం సంతోషకరన్నారు. ధ్యాన దినోత్సవానికి ఏకగ్రీవంగా ఆమోదముద్ర లభించడంపై ఓటువేసిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ‘వసుదైక కుటుంబం’ అనే ప్రాథమిక సూత్రం ద్వారా మానవసంక్షేమం కోసం భారత్ కృషి చేస్తుందన్నారు. డిసెంబర్ 21న ఉత్తరాయణం ప్రారంభమవుతుంది, సంవత్సరం చివరిలో పవిత్రమైన రోజని ధ్యానాన్ని ప్రారంభించడం సంతోషకరమని పర్వనేని హర్షం వ్యక్తం చేశారు. యోగా దినోత్సవం జరిగిన ఆరు నెలల తరువాత ప్రతీయేటా ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటారు.