నటుడు బాలాజీ కన్నుమూత
విలన్ వేషాలతో పేరు తెచ్చుకున్న ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ (48) గుండెపోటుతో శనివారం ఉదయం మృతిచెందారు.
చెన్నై: విలన్ వేషాలతో పేరు తెచ్చుకున్న ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ (48) గుండెపోటుతో శనివారం ఉదయం మృతిచెందారు. తమిళంతో బాటు ఆయన వివిధ భాషల్లోని సినిమాల్లో నటించి విలన్ కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. మొత్తం 40 సినిమాల్లో బాలాజీ నటించారు. టీవీ సీరియళ్ల ద్వారా కేరీర్ ప్రారంభించిన బాలాజీ చిట్టితో గుర్తింపు రాగా, తెలుగు సినిమా టక్ జగదీశ్లో విలన్ కేరక్టెర్ను పోషించి ఔరా అనిపించుకున్నారు. డేనియల్ బాలాజీ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.