కేజ్రీకి మాలివాల్​ చురకలు

Kejri's Maliwal's charms

Oct 4, 2024 - 13:29
 0
కేజ్రీకి మాలివాల్​ చురకలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాజభవనాన్ని విడిచిపెట్టి, మరొక ప్యాలెస్​ లో ఉండడాన్ని కూడా మాజీ సీఎం కేజ్రీవాల్​ త్యాగంగా అభివర్ణించడాన్ని రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్​ తప్పుబట్టారు. ఎక్స్​ మాధ్యమంగా శుక్రవారం మాలివాల్​ ఆప్​ అధినేతకు పలు ప్రశ్నలు సంధించారు. మర్యాద పురుషోత్తముడిగా చెప్పుకునే మీరు ఒక స్ర్తీపై దాడికి పాల్పడడం ఏ మాత్రం సమంజసమని నిలదీశారు. ఆదర్శాలు మరిచి మహిళలపై దాడులకు పాల్పడే వ్యక్తులను కాపాడరని మండిపడ్డారు. తమను తాము మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి పోల్చుకోవడం శోచనీయమని స్వాతిమాలివాల్​ మండిపడ్డారు.
మరోవైపు కేజ్రీవాల్​ తన సివిల్​ లైన్స్​ లోని అధికారిక నివాసాన్ని శుక్రవారం ఖాళీ చేశారు. ఢిల్లీలోని ఫిరోజ్​ షా రోడ్​ లో పంజాబ్​ రాజ్యసభ ఎంపీ అశోక్​ మిట్టల్​ కు చెందిన బంగ్లాకు మారారు. కేజ్రీవాల్​ మారిన ఈ ఇళ్లు పార్టీ కార్యాలయానికి చేరువులో ఉంది.