పాక్, చైనాలకు ఆస్ట్రా ఎంకె–2 దడ
దేశీయంగా డీఆర్డీవో రూపొందించిన క్షిపణి 130 నుంచి 160 కి.మీ. పరిధి లక్ష్యాన్ని నాశనం చేయడంలో దిట్ట డీఆర్డీవో ఉత్పత్తులపై రక్షణ శాఖ సంతృప్తి భవిష్యత్తులో ఆస్ట్రా ఎంకె–3కి రెఢీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశీయంగా తయారైన ఆస్ట్రా ఎంకె–2తో క్షిపణితో ఇటు పాక్, అటు చైనాల్లోనూ కలవరపాటు మొదలైంది. యుద్ధ ప్రాంతంలో లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత వేగంగా గురి తప్పకుండా పరీక్షించడంలో భారత్ పలుమార్లు విజయాన్ని సాధించింది. చివరి సారి ఈ క్షిపణిని భారత్ పరీక్షించనుంది. ఈ పరీక్షలో విజయం సాధిస్తే ఇక భారత్ రక్షణ రంగంలోకి ఆస్ట్రా ఎంకె–2 అడుగిడి శత్రుదేశాల్లో దడ పుట్టించనుంది.
ఎయిర్ టు ఎయిర్ క్షిపణి (గాలిలో నుంచే సమర్థంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాడులు చేయగలదు) దీని పరిధి 130 నుంచి 160 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించనుంది. ఇప్పటికే ఈ క్షిపణిని తేజస్ ఫైటర్ జెట్ నుంచి పలుమార్లు ప్రయోగించి, పరీక్షించి విజయం సాధించారు. ఈ క్షిపణిని డీఆర్డీవో రూపొందించింది.
ఇప్పటికే ఆస్ట్రా ఎంకె–1 రక్షణ రంగంలో ఉంది. ఈ క్షిపణి పనితీరుపట్ల వైమానిక దళం సంతృప్తి వ్యక్తం చేయడంతో దీనికి అడ్వాన్స్ డ్ సాంకేతికతను జోడిస్తూ డీఆర్డీవో ఆస్ట్రా ఎంకె–2ను రూపొందించింది. దీని బరువు 154 కిలోలు, పొడవు 12.6 అడుగులు. రక్షణ శాఖకు ఈ తరహా క్షిపణులు 200 అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్షిపణి 15 కేజీల ఆయుధాలను కూడా తనతోబాటు మోసుకెళ్లగలదు. భూమి నుంచి 66 వేల అడుగుల ఎత్తులో గరిష్టంగా ఇది ప్రయాణిస్తుంది. దీని వేగం గంటకు 5556.6 కి.మీ. దీని వేగాన్ని పసిగట్టడంతో పలుమార్లు రాడార్లు కూడా విఫలం చెందడం గమనార్హం.
ఈ ఆస్ట్రా ఎంకె–2కు మరో ప్రత్యేకత ఉంది భూతలం నుంచి లక్ష్యాన్ని నిర్దేశించి వదిలిన తరువాత గాలిలో ఉండగా కూడా దీన్ని లక్ష్యాన్ని మరోమారు మార్చే అవకాశం ఉంది. దాడికి చివరి క్షణంలో కూడా నావిగేషన్ తో దీని దిశను మార్చుకోవచ్చు. క్షిపణి వ్యవస్థలో ఈ వ్యవస్థే అత్యంత కీలకంగా, ప్రాణాంతకంగా నిలుస్తోంది. ఈ క్షిపణిని తేజస్, మిగ్, సుఖోయ్ యుద్ధ విమానాల్లో అమర్చవచ్చు
దీంతో బాటు భవిష్యత్తులో ఆస్ట్రా ఎంకె–3ని కూడా రూపొందిస్తామని డీఆర్డీవో ధీమా వ్యక్తం చేస్తోంది. దీని పరిధిని మరింత పెంచుతామని సంస్థ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పరిధి 350 కిలోమీటర్లుగా ఉండనుందని వెల్లడించారు.
ఈ రెండు క్షిపణుల ద్వారా శత్రువులపై దాడికి పూనుకుంటే ఇక వాని పని ఖతమే అని పలువురు రక్షణ రంగ నిపుణులు పేర్కొనడం గమనార్హం.