చైనాలో ఘోర ప్రమాదం 35 మంది మృతి

43 మందికి గాయాలు

Nov 12, 2024 - 20:08
 0
చైనాలో ఘోర ప్రమాదం 35 మంది మృతి

ఎయిర్​ షోపై దూసుకొచ్చిన కారు
62యేళ్ల వృద్ధుడు అరెస్ట్​ 
అధ్యక్షుడు జిన్​ పింగ్​ సంతాపం

బీజింగ్​: చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందగా, మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారకులను కఠినంగా శిక్షించాలని అధ్యక్షుడు జిన్​ పింగ్​ అధికారులను ఆదేశించారు. మృతులకు సంతాపం ప్రకటించి, ప్రమాదంలో గాయపడ్డవారు వెంటనే కోలుకునేలా అత్యాధునిక వైద్య చికిత్సను అందజేయాలని ఆదేశించారు. ప్రమాదం వివరాలపై ఆరా తీశారు. 

చైనా జుహై లో మంగళవారం ఎయిర్​ షో కొనసాగుతుంది. ఎయిర్​ షోను వీక్షించేందుకు భారీగా సందర్శకులు విచ్చేశారు. ఓ 62యేళ్ల వృద్ధుడు కారు నడుపుతుండగా అది కాస్త అదుపుతప్పి సందర్శకుల మీదకు అత్యంత వేగంగా దూసుకువచ్చింది. దీంతో భారీ ఎత్తున సందర్శకులు గాయాలపాలయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు కారును, కారు డ్రైవింగ్​ సీటులో ఉన్న వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే 35 మంది చెందినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు.  ఈ ప్రమాదంలో మరిన్ని వివరాలను అధికారులు వెల్లడించలేదు.