నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: శనివారం మధ్యాహ్నం మూడు వందేభారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో మాధ్యమంగా ప్రారంభించనున్నారు. మేక్ ఇండియాలో భాగంగా మీరట్ – లక్నో, మధురై – బెంగళూరు, చెన్నై – నాగర్ కోయిల్ మార్గాలలో ఈ వందేభారత్ రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు యపీ, తమిళనాడు, కర్ణాటకలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి.
ఉదయం భారత్ మండపంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ జాతీయ సదస్సును ప్రధాని ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టాంపు, నాణేన్ని విడుదల చేయనున్నారు. సుప్రీంకోర్టు నిర్వహించే ఈ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగనుంది. మౌలిక సదుపాయాలు, సమగ్ర న్యాయస్థానాలు, న్యాయ భద్రత, కేసులు, నిర్వహణ, శిక్షణ వంటి అంశాలపై పలువురు న్యాయవాదులు, న్యాయమూర్తులు చర్చించనున్నారు. ఈ ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రి, అటార్నీ జనరల్ కూడా పాల్గొంటారు.