లక్నో భవనం కూలి 8మంది మృతి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

మృతులకు పరిహారం ప్రకటన ఉన్నతస్థాయి విచారణకు సీఎం యోగి ఆదేశం

Sep 8, 2024 - 17:45
 0
లక్నో భవనం కూలి 8మంది మృతి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
లక్నో: లక్నోలో భవనం కూలి 8మంది మృతి చెందిన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు పూర్తి స్వస్థత చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. 
 
శనివారం లక్నోలని ట్రాన్స్​ పోర్ట్​ నగర్​ లో మూడంతస్తుల మెడికల్​ గోదాం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందగా, 28మందికి గాయాలయ్యాయి. 
 
ఈ ప్రమాదంపై ప్రధాని ఆదివారం విచారం వ్యక్తం చేస్తూ మృతులకు రూ. 2 లక్షల ఎక్స్​ గ్రేషియా, గాయపడిన వారికి కేంద్రం తరఫున రూ. 50వేలను ప్రకటించారు. గాయపడిన వారు మూడు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమందిని ఆదివారం డిశ్చార్జీ చేశారు. 
 
కాగా భవనం కూలిన ఘటనపై విచారణకు కమిటీని చేస్తున్నట్లు లక్నో జాయింట్​ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ అమిత్​ వర్మ ప్రకటించారు. భవనం కూలడం వెనుక కారణాలను అన్వేషిస్తారని తెలిపారు. భవిష్యత్​ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. మరోవైపు యోగి ఆదిత్యనాథ్​ ఈ ప్రమాదంపై వెంటనే విచారణకు అధికారులను ఆదేశించారు. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.