మహారాష్ట్ర, ఢిల్లీ, ఝార్ఖండ్ ఎన్నికలకు బీజేపీ సిద్ధం
ఆరు రాష్ట్రాల్లోని 26 స్థానాల్లోనూ ఉప ఎన్నికలు
హరియాణాలో గెలుపు, జమ్మూలో పుంజుకున్న కమలం
అదే స్ర్టాటజీని ఉపయోగించాలని నిర్ణయం?
నూతన అభ్యర్థులకు అవకాశం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: దేశంలో మోదీ మేనియా కొనసాగుతోంది. హరియాణాలో 48 సీట్లతో ఊహించిన విధంగానే విజయఢంకా మోగించింది. కానీ అన్ని సర్వేల్లో విజయం కాంగ్రెస్ దే అని పేర్కొనగా ఆ లెక్క పూర్తిగా తప్పింది. బీజేపీ మార్పు వ్యూహం అనేది ఈ రాష్ర్టంలో పార్టీకి విశేషంగా మేలు చేకూర్చింది. ఇక్కడ కాంగ్రెస్ చతికిలపడేందుకు మోదీ బ్రాండ్ ఇమేజ్ బాగా పనిచేసింది. మరోసారి హ్యాట్రిక్ సాధించి పెట్టింది.
అదే సమయంలో జమ్మూకశ్మీర్ లో 29 స్థానాలు సాధించి సత్తా చాటిందనే చెప్పాలి. ఇక్కడ బీజేపీని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగినా ప్రజలు వాటిని తిప్పికొట్టారు. గెలిచింది. కాంగెస్–ఎన్సీపీల నేతృత్వంలోని కూటమే అయినప్పటికీ ఈ రెండింటి కలయికతో మహాబూబా ముఫ్తీ పీడీపీకి తీవ్ర నష్టం జరిగింది. అదే సమయంలో బీజేపీ అనూహ్యాంగా పుంజుకొని సింగిల్ గానే ఇన్ని స్థానాలను సాధించగలిగింది. ఒకవేళ ఈ రెండు పార్టీల కూటమి ఏర్పాటు కాకపోతే ఇక్కడ బీజేపీ విజయం ఖాయమయ్యేది. బీజేపీ ఓటింగ్ షేర్ కూడా భారీగా పెరిగింది. ఇప్పటికిప్పుడు ఈ కూటమి అధికారం చేపడుతున్న వీరికి ఇచ్చిన హామీలు గుదిబండలా మారే అవకాశం ఉంది. రాహుల్–ఒమర్ అబ్దుల్లా తలపై ముళ్ల కిరీటంతో ఎలాంటి పాలన చేపడతారో? వేచి చూడాలి.
మరోవైపు ఇదే ఊపుమీదున్న బీజేపీ మహారాష్ర్ట, ఝార్ఖండ్, మరో 10 స్థానాల్లో వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్న ఎన్నికల్లోనూ ఇదే స్ర్టాటజీని కొనసాగించనుంది.
మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చే వ్యూహాన్ని బీజేపీ పునరావృతం చేసే యోచనలో ఉంది. ఎన్నికల ముందు సీఎంను మార్చే ఎత్తుగడను బీజేపీ పునరావృతం చేసే అవకాశం ఉంది. గుజరాత్, ఉత్తరాఖండ్, త్రిపుర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు బీజేపీ సీఎంలను మార్చింది. వీటిలో కర్ణాటక మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.
మహారాష్ట్రలో 26 నవంబర్ 2024కు పదవీ కాలం ముగియనుంది. ఈ రాష్ర్టంలో 288 స్థానాలున్నాయి. గెలుపు కోసం 145 స్థానాలు అవసరం అవుతాయి. అదే సమయంలో ఝార్కండ్ లో 5 జనవరి 2025న పదవీ కాలం ముగియనుంది. 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజార్టీ ఫిగర్ 41గా ఉంది. ఢిల్లీలో 2 ఫిబ్రవరి 2025న పదవీ కాలం ముగియనుంది. 70 అసెంబ్లీ స్థానాలలో 36 విజయం కోసం అవసరం అవుతాయి. ప్రస్తుతం మహారాష్ర్టలో ఎన్డీయే కూటమి, ఝార్ఖండ్ లో ఇండి కూటమి, ఢిల్లీలో ఆప్ పార్టీలు అధికారంలో ఉన్నాయి.
అదే సమయంలో ఆరు రాష్ర్టాల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ 10, రాజస్థాన్ 6, బిహార్ 4, మధ్యప్రదేశ్ 2, పంజాబ్ 5, ఛత్తీస్ గఢ్ 1 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
మహారాష్ట్ర: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన షిండే, ఎన్సీపీ అజిత్ పవార్, స్వతంత్రులు, చిన్నపార్టీలతో మహాకూటమిని బీజేపీ ఏర్పాటు చేసి రంగంలోకి దిగనుంది.
ఝార్ఖండ్: బీజేపీ, అజూస, ఎన్సీపీతో కలిసి ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగనుంది.
ఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ ఈసారి ఒంటరిగా పోరాడనుందా? ఇతర పార్టీలతో జతకట్టనుందా? అనేది ఇంకా స్పష్టం కాలేదు.