హరియాణా ఫలితాలు విశ్లేషిస్తున్నాం

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ

Oct 9, 2024 - 13:32
 0
హరియాణా ఫలితాలు విశ్లేషిస్తున్నాం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హరియాణా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్నామని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ బుధవారం స్పందించారు. ఎక్స్​ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జమ్మూకశ్మీర్​ గెలుపునకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య ఆత్మగౌరవానికి దక్కిన విజయంగా రాహుల్​ అభివర్ణించారు. అదే సమయంలో హరియాణాలో అనేక ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని ఈసీ దృష్టికి తీసుకువెళతామన్నారు. ఈ ఫలితాలపై విశ్లేషణ చేపట్టామని రాహుల్​ గాంధీ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున తమ గళాన్ని వినిపిస్తూనే ఉంటామని రాహుల్​ స్పష్టం చేశారు.