నైజీరియాకు ప్రధాని మోదీ

Modi is the Prime Minister of Nigeria

Nov 16, 2024 - 16:24
 0
నైజీరియాకు ప్రధాని మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 17యేళ్ల తరువాత నైజీరియా పర్యటనకు బయలుదేరారు. శనివారం మధ్యాహ్నం న్యూ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన నైజీరియాకు పయనమయ్యారు. అధ్యక్షుడు టినుబు ఆహ్వానం మేరకు రెండు రోజులు పర్యటించనున్నారు. ఆదివారం అధ్యక్షుడు అహ్మద్​ టినుబుతో భేటీ కానున్నారు. భారత్​ – నైజీరియా ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రాజధాని అబుజాలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. నైజీరియాలో 150కిపైగా భారతీయ సంస్థలున్నాయి. వీటి టర్నోవర్​ 2 లక్షల కోట్లకు పై మాటే. ఆదేశ ఆర్థిక వృద్ధిలో భారతీయులు ఆయువుపట్టుగా ఉన్నారు. నైజీరియాలో లభించే చమురు, గ్యాస్​ నిల్వలు భారత్​ కు ముఖ్యమైనవి. ఈ దేశం భారత ఇంధన అవసరాలను తీర్చగలదు మైనింగ్​, ఫార్మాస్యూటికల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాలలో ఆఫ్రికాలో భారతీయ పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. 
 
నైజీరియా..
వైశాల్యం 9,23,769 కిలోమీటర్లు. 23 కోట్ల జనాభా. ఇంగ్లీష్​, హౌసా, యెరూబా స్థానిక భాషలు. ఈ దేశంలో 250కంటే ఎక్కువ జాతులుంటాయి. 500 భాషలు మాట్లాడతారు. ఆఫ్రికాలో భారత్​ కు అతిపెద్ద బిజినెస్​ పార్టనర్​ నైజీరియా కావడం గమనార్హం. 2020–21  74,387 కోట్లు, 2021–22 1,26,233 కోట్లు,  2023–24  మధ్య రూ. 99, 629 కోట్ల వ్యాపారం జరిగింది. 
 
భారత్​ –నైజీరియా వ్యాపార బంధాలు..
భారత్​ నైజీరియాకు మందులు, వాహనాలను ఎగుమతి చేస్తుంది. 
ఇంధనం, గ్యాస్​ నిల్వలను భారత్​ దిగుమతి చేసుకుంటుంది.
చైనా, నెదర్లాండ్​ తరువాత నైజీరియా భారత్​ కు ఈ రంగంలో అతిపెద్ద బిజినెస్​ పార్టనర్​ గా చెప్పొచ్చు. 
భారత్​ కు చెందిన ఎయిర్​ టెల్​ నైజీరియాలో అతిపెద్ద రెండో టెలికామ్​ సంస్థ.
150 భారతీయ సంస్థలుండగా, 27 అరబ్​ డాలర్లు పెట్టుబడులున్నాయి. 
నైజీరియాకు స్వాతంత్ర్యం రాకముందు 1958లోనే భారత్​ దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 
2002లో 40 యేళ్ల తరువాత కామన్​ వెల్త్​ దేశాల సమావేశంలో పాల్గొనేందుకు అప్పటి ప్రధాని అటల్​ బిహారీ వాజ్​ పేయి నైజీరియాకు వెళ్లారు