ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి
జగద్గురు రాంభద్రాచార్యులు
కుల ఆధారిత రిజర్వేషన్లు రద్దు చేయాలి
హిందువులంతా ఒక్కటే
మనమంతా భారతీయులమే
జైపూర్: ప్రభుత్వం కుల ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేసి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని జగద్గురు రాంభద్రాచార్యులు అన్నారు. శనివారం రామకథ కోసం జైపూర్ కు రాంభద్రాచార్యులు విచ్చేసి ప్రసంగించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అంటూ ఎవరూ లేరని హిందువులంతా ఒక్కటే అని మనమంతా భారతీయులేమని అన్నారు. త్వరలో తాను చెప్పిన ప్రకారంగా జరగబోతోందన్నారు. కులమనే అంతర్యుద్ధం స్వయంచాలకంగా ముగుస్తుందన్నారు.
దేశంలో 80శాతం మందిని హిందువులుగా మార్చితే సమస్య ముగుస్తుందన్నారు. తాను చెప్పినట్లుగానే రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ ఎన్నికయ్యారని గుర్తు చేశారు. దేశ హితానికి శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ చేతులను మరింత బలోపేతం చేయాలని జగద్గురు రాంభద్రాచార్యులు విజ్ఞప్తి చేశారు.