శిరోమణి అకాదళ్​ అధ్యక్ష పదవికి సుఖ్బీర్​ సింగ్​ రాజీనామా!

Sukhbir Singh resigned from the post of president of Shiromani Akadal!

Nov 16, 2024 - 16:59
 0
శిరోమణి అకాదళ్​ అధ్యక్ష పదవికి సుఖ్బీర్​ సింగ్​ రాజీనామా!
చండీగఢ్: పంజాబ్​ రాజకీయాల్లో అనూహ్యా పరిణామం చోటు చేసుకుంది. శనివారం శిరోమణి అకాలీదళ్​ అధ్యక్ష పదవికి సుఖ్బీర్​ సింగ్​ బాదల్​ రాజీనామా చేశారు. పంజాబ్​ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఆయనపై పలు ఆరోపణలు, ప్రత్యారోపణలు వచ్చాయి. దీనిపై అసంతృప్తితో ఉన్న ఆయన తన రాజీనామాను ప్రకటించారు. పార్టీలో ఒక వర్గం నుంచి సుఖ్బీర్​ సింగ్​ కు వ్యతిరేకత ఎదురవుతోంది. రాజీనామాను మాజీ మంత్రి దల్జీత్ సింగ్ చీమా ధృవీకరించారు. అయితే ఎస్ ఎడీ వర్కింగ్​ కమిటీ అధ్యక్షుడు ఎస్​ బల్విందర్​, ఎస్​ భుందర్​ ఈ నెల 18న చండీగఢ్​ లోని పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాజీనామాను పరిశీలించి తదుపరి అధ్యక్షుడు ఎవరన్నది అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా డిసెంబర్​ 14న వర్కింగ్​ కమిటీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది.