పాట్నా సాహిబ్ గురుద్వారాలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు
రొట్టెలు చేసి వడ్డించిన ప్రధాని ప్రత్యేకమైన వేషాధారణతో ఆకట్టుకున్న ప్రధాని
పాట్నా: మూడు రోజులపాటు బిహార్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సోమవారం పాట్నాలోని సాహిబ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురుద్వారాలో పెద్ద ఎత్తున భక్తులు నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని మోదీ గురుద్వారాకు వెళ్లగానే ప్రధాని తొలుత ఆలయంలో బాబాసాహిబ్ కు పూలు సమర్పించారు. అనంతరం శిరస్సు వంచి ప్రార్థించారు. భక్తులకు అభివాదం చేస్తూ వంటగడిలోకి వెళ్లి రొట్టెలను చేశారు. పనివారికి సహాయం చేశారు. అనంతరం పలువురు భక్తులకు స్వయంగా భోజనాలను వడ్డించారు.
భక్తులకు అభివాదం చేస్తుండగా ఓ చిన్న పిల్లవాడి ఉత్సుకత చూసి ప్రధాని మోదీ పిల్లాడితో కరచాలనం చేసి సంతోషపెట్టారు.
మోదీ గురుద్వారాకు వచ్చేముందు సాంప్రదాయ సిక్కు దుస్తులు, తలపాగాను ధరించి వచ్చారు. ఆ వేషాధారణలో ప్రధానిని చూసిన పలువురు భక్తులు ఆయన్ను కలిసేందుకు ఆసక్తి చూపించినా ప్రోటోకాల్ నిబంధనల వల్ల భద్రతా సిబ్బంది ఎవ్వరినీ దగ్గరకు రానీయలేదు. అయినా ప్రధాని అందరికి వందనాలు తెలుపుతూ ముందుకు సాగారు.