డ్రగ్స్ సిండికేట్.. తుషార్ తో కాంగ్రెస్ బంధం
ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేత సుధాన్షు త్రివేది
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ సిండికేట్ లో ప్రధాన సూత్రధారిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్టీఐ సెల్ నేత తుషార్ గోయల్ (ఢిక్కీ గోయల్) పట్టుబడటాన్ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది తీవ్రంగా విమర్శించారు. ఇతనికి నేరుగా కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడాలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. నిందితుడి మొబైల్ నుంచి నేరుగా దీపేందర్ సంప్రదింపులు జరిపాడని తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నోరు మెదకపోవడం శోచనీయమన్నారు. నిందితుడి నుంచి దర్యాప్తు బృందాలు మరింత సమాచారాన్ని రాబడుతున్నాయని తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం పూర్తిగా బయటపడడం ఖాయమని సుధాన్షు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన డ్రగ్స్ కుంభకోణాల జప్తులో ఉన్న మొత్తాన్ని ఎన్నికలకు ఉపయోగించారని ఆరోపించారు. ఇలాంటి డబ్బుతో ఆయా రాష్ర్టాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ డ్రగ్స్ ముఠా వారికే పార్టీ పదవులు అప్పజెప్పడం చూస్తుంటే ఈ పార్టీ దేశాన్ని అగాధంలోకి నెట్టేలా వ్యవహరిస్తోందని స్పష్టం అవుతుందన్నారు. అంతేగాక తుషార్ కు కాంగ్రెస్ లో నియమించిన లేఖను సుధాన్షు త్రివేది చదివి వినిపించారు. ఈ లేఖలో సోనియా, రాహుల్ గాంధీల పేర్లు కూడా ఉండడం విశేషం.