రిజర్వేషన్ల నిబంధన నవంబర్ 1 నుంచే అమలు
The reservation rule will be implemented from November 1
120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిన పరిధి
విదేశీ పర్యాటకుల రిజర్వేషన్లలో మార్పుల్లేవ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రైల్వే టికెట్ బుకింగ్ రిజర్వేషన్ల నిబంధనలు నవంబర్ 1 శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం ఇక నుంచి 120 రోజుల ముందు చేసే రిజర్వేషన్ల పరిధిని 60 రోజులకు తగ్గించారు. కాగా ఈ యేడాది అక్టోబర్ 31 వరకు చేసిన అన్ని బుకింగ్ లకు పాత పద్ధతులే వర్తించనున్నాయి. 61 రోజుల నుంచి 120 రోజుల మధ్య చేసే రిజర్వేషన్లు రద్దు చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో విండో టికెట్ హోర్డింగ్ తగ్గనుంది. కొన్ని మధ్యాహ్నం నడిచే రైళ్లలో మాత్రం 120 రోజుల రిజర్వేషన్ల నిబంధనే వర్తించనుంది. అదే సమయంలో విదేశీ పర్యాటకుల కోసం 365 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ యథాతథంగా ఉంటుందని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.