మోదీ అంటే పాక్​ కు దడ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా,

Sep 21, 2024 - 21:23
Sep 21, 2024 - 21:23
 0
మోదీ అంటే పాక్​ కు దడ

శ్రీనగర్: 90వ దశకంలో జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో తనకంటే బాగా ఇక్కడి ప్రజానీకానికే తెలుసునని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రస్తుతం పాక్ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అఘాతంలోకి వెళ్లిపోయిందని మోదీ అంటేనే జడుసుకుంటుందని అమిత్ షా అన్నారు. 

శనివారం జమ్మూకశ్మీర్‌లో రెండో దశ ఎన్నికల సందర్భంగా మేధార్‌లో బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రిజర్వేషన్లు అంతం ఉన్నాయి, ఆర్టికల్ ను 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్, ఎన్సీలు కలిసి మళ్లీ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టే ప్రయత్నాలను ప్రతీ ఒక్కరూ గమనించాలి. ఈ రెండు పార్టీలు ఉగ్రవాదులు, రాళ్లదాడులు, హింస వైపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి వ్యాఖ్యలనే గాకుండా ఈ రెండు పార్టీలను ప్రత్యక్షంగా నామరూపాలు లేకుండా ప్రజలకు అందించారు. గుర్జర్ బకర్వాల్, పహారీలకు పదోన్నతులలో మోదీ హామీని రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీరి ప్రభుత్వ హయాంలో పక్కదేశంతో కూడా భయపడేవారు వీరు రాష్ట్టానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఎప్పుడూ హింసాత్మకంగానే రాష్ట్రం ఉండేదన్నారు. కానీ తామొచ్చాక ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని శత్రువులకు మనమంటే భయపడేలా రుచి చూపించామన్నారు. రెండోవిడత ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు పాల్గొని బీజేపీకి సంపూర్ణ మద్ధతు తెలపాలని నిర్ణయించిన అభివృద్ధిని కాంక్షించాలని.