మోదీ కేబినెట్​ లో 63 మంది

72 మంత్రి పదవులు? తెలంగాణ నుంచి కిషన్​ రెడ్డికి మరోమారు అవకాశం

Jun 9, 2024 - 14:48
 0
మోదీ కేబినెట్​ లో 63 మంది

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మోదీ కేబినెట్​ లో బీజేపీకి చెందిన 63 మందికి మంత్రి పదవులు దక్కింది. న్యూఢిల్లీలో ఆదివారం మంత్రి పదవులు దక్కనున్న పలువురితో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. పలు విషయాలపై వారికి కూలంకషంగా వివరించారు. దేశ కీర్తి,ప్రతిష్ఠలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మోదీ ప్రమాణ స్వీకారం రాత్రి 7.15 గంటలకు జరగనుంది. మోదీతోపాటు 63 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇక మంత్రి పదవుల్లో తెలుగు ప్రాంతాలకు కూడా అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. తెలంగాణ నుంచి కిషన్​ రెడ్డితోపాటు మరొకరికి, ఆంధ్ర నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. మహారాష్ర్ట, బిహార్​, హరియాణా, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​, యూపీ తదితర ప్రాంతాల్లోని ఎంపీలకు మంత్రి పదవులు దక్కాయి. ఎల్జేపీ, జేడీయూ, హెచ్​ ఏఎం, ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్యులకు కూడా మంత్రిపదవుల్లో చోటు లభించనుంది. కాగా మోదీ ఆదివారం రాత్రి 7 గంటలకు చేపట్టబోయే ప్రమాణ స్వీకారంలో ఏడు దేశాలకు చెందిన ప్రముఖులతో బాటు దేశ, విదేశీ అతిథులు హాజరుకానున్నారు. మోదీ మూడోసారి అధికారం చేపట్టి నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. 

మోదీ కేబినెట్​?

 రాజ్​ నాథ్​ సింగ్​, అమిత్​ షా, నితీన్​ గడ్కరీ, మనోహార్​ లాల్​ ఖట్టర్​, శివరాజ్​ సింగ్​ చౌహాన్​, జి.కిషన్​ రెడ్డి, హెచ్​ డీ కుమారస్వామి, జ్యోతిరాధిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్​, హర్దీప్​ సింగ్​ పూరీ ఎస. జయశంకర్​, జయంత్​ చౌదరీ, అనుప్రియా పటేల్​, రవనీత్​ సింహ్​ బిట్టూ, జిత్​ ప్రసాద్​, పంకజ్​ చౌదరీ, రాజీవ్​ సింగ్​, సంజయ్​ సేథ్​, శోభా కరాందలాజే, గిరిరాజ్​ సింగ్​, రామ్​ దాస్​ అథవాలే, నిత్యానంద్​ రాయ్​, బీఎల్​, వర్మ, అనుప్రియా దేవి, అ ర్జున్​ రామ్​ మేఘ్వాల్​, పీయూష్​ గోయల్​, రావ్​ ఇంద్రజిత్​ సిగ్​, అజయ్​ టామ్టా, జితన్​ రామ్​ మాంఝీ, చిరాగ్​ పాశ్వాన్​, నిర్మలా సీతారామన్​, సర్బానంద్​ సోనోవాల్​, బండి సంజయ్​, రామ్​ మోహన్​ నాయుడు, చంద్రశేఖర్​, జితేంద్ర సింగ్​, అశ్విని వైష్ణవ్​, భూపేంద్ర యాదవ్​, ప్రహ్లాద్​ జోషి, మన్సుఖ్​ మాండవీయా, జేఎల్​ ఓరావ్​, తోఖాన్​ సాహు ప్రస్తుతం ఈ 43 పేర్లు మాత్రం బయటికి వచ్చాయి. మొత్తం 72 మంత్రుల్లో ఇంకా ఎవరెవరున్నారనేది మంత్రి పదవుల అనంతరమే తెలియనుంది.