హస్తినలో పాలన అస్తవ్యస్తం చుట్టుముట్టిన కరెంటు కష్టాలు

Electricity woes surround governance chaos in Hastina

Jun 11, 2024 - 17:36
 0
హస్తినలో పాలన అస్తవ్యస్తం చుట్టుముట్టిన కరెంటు కష్టాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. సవ్యంగా పరిపాలించాల్సిన సీఎం కాస్త అవినీతి కేసులో జైలులో ఉండడంతో సత్వర నిర్ణయాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఓ వైపు నీటి కష్టాలు కొనసాగుతూనే ఉండగా, మరోవైపు కరెంటు కష్టాలూ ఢిల్లీని చుట్టుముడుతున్నాయి. మంగళవారం యుపిలోని మండోలాలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పిజిసిఐఎల్) సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సబ్​ స్టేషన్​ నుంచే ఢిల్లీకి 1200 మెగావాట్ల విద్యుత్ లభిస్తుంది. ఈ సబ్​ స్టేషన్​ పునరుద్ధరణకు సమయం పట్టనుండడంతో అప్పటివరకూ 1200 మెగావాట్ల విద్యుత్​ సరఫరాకు ఆటంకాలు ఏర్పడనున్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి ఎక్స్​ లో పోస్ట్​ చేస్తూ వివరించింది. కేంద్ర విద్యుత్​ శాఖ మంత్రితో అపాయింట్​ మెంట్​ కోరినట్లు తెలిపింది. మరోవైపు ఢిల్లీ పాలనపై రోజురోజుకు నీలినీడలు కమ్ముకోవడం పట్ల బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది.