జవాన్లు ప్రయాణిస్తున్న రైలు ట్రాక్​ పై 10 డిటోనేటర్లు!

ఆలస్యంగా విషయం వెలుగులోకి పొగమంచువే అంటున్న అధికారులు ఎవరు పెట్టారనే దానిపై సమాధానం లేదు దర్యాప్తు వేగవంతం చేసిన నిఘా వర్గాలు

Sep 22, 2024 - 13:34
 0
జవాన్లు ప్రయాణిస్తున్న రైలు ట్రాక్​ పై 10 డిటోనేటర్లు!
భోపాల్​:  మధ్యప్రదేశ్​ లో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న రైలును పేల్చివేసేందుకు భారీ కుట్ర జరిగింది. కుట్ర జరిగి నాలుగు రోజులైంది. ఆదివారం ఆలస్యంగా విషయం వెలుగులోకొచ్చింది. ఆర్మీ ప్రయాణిస్తున్న రైలుముందు ఏకంగా 10 డిటోనేటర్లు పెట్టారు. నేపానగర్​ లో ఈ కుట్ర జరిగినట్లు అధికారులు తెలిపారు. 
 
విషయం ఏమిటి?
మధ్యప్రదేశ్‌లోని నేపానగర్ అసెంబ్లీలోని సగ్‌ఫాటా ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు రైలు ముందు డిటోనేటర్లను పెట్టారు. రైలు వెళుతుండగా డిటోనేటర్ శబ్దం రావడంతో డ్రైవర్ అప్రమత్తమై రైలును ఆపి స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించాడు. 
 
సమాచారం అందిన వెంటనే ఏటీఎస్, ఎన్ఐఏ సహా రైల్వే ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది సైన్యానికి సంబంధించిన అంశం కావడంతో అధికారులు గోప్యత పాటిస్తున్నారు.
 
సెప్టెంబర్​ 18న జమ్మూకశ్మీర్​ నుంచి కర్ణాటకకు జవాన్లతో కూడిన రైలు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం పోలీస్ శాఖ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ, నేపానగర్ ఎస్ డీఓపీ, పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి, రైల్వే అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎన్ ఐఎ, ఏటీఎస్​ లు కూడా ఆదివారానికి పెద్ద యెత్తున చేరుకొని దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఈ డిటోనేటర్లు పొగమంచుకోసం ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. ఇందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తెలిపారు. పొగమంచు డిటోనేటర్లను రైల్వే అధికారులు కూడా ట్రాక్​ పై పెట్టనట్లుగా దర్యాప్తు బృందాలు తెలిపాయి. లోకోపైలట్​ కు ఏదైనా అడ్డంకి ఉంటే ఈ డిటోనేటర్లను వాడతారని అధికారులు చెబుతున్నారు. అయినా దర్యాప్తు సంస్థల విచారణలో ఇంకా ఈవి ఏ రకమైన డిటోనేటర్లు తదితర వివరాలు తెలియరాలేదు.