మిజోరాంలో గని ప్రమాదం 17 కు చేరిన మృతులు

Mizoram mine accident death toll rises to 17

May 28, 2024 - 18:43
 0
మిజోరాంలో గని ప్రమాదం 17 కు చేరిన మృతులు

ఐజ్వాల్​: ఐజ్వాల్​ లో మంగళవారం ఉదయం గని కూలిన ప్రమాదంలో సాయంత్రం ఆరు గంటల వరకు మృతుల సంఖ్య 17కు చేరుకుంది. రెమాల్​ తుపాను కారణంగా మిజోరాంలో వర్షాలు భారీగా కురుస్తుండడంతో గని కూలింది. వీరిలో నాలుగేళ్ల బాలుడు, ఆరేళ్ల బాలికలు కూడా ఉన్నారు. రెస్క్యూ బృందాలు ఇద్దరిని రక్షించగలిగాయి. శిథిలాల కింద మరో పదిమంది వరకు ఉన్నట్లు అనుమానిస్తున్నామని డీజీపీ అనిల్​ శుక్లా తెలిపారు. సాయంత్రం వరకు 17 మృతదేహాలను వెలికితీశామన్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డీజీపీ స్పష్టం చేశారు. కాగా అస్సాంలోనూ బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో ఇద్దరు మృతి చెందారు. పాఠశాల బస్సుపై చెట్టు కూలడంతో 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.