దక్షిణాఫ్రికా నుంచి సురక్షితంగా 27మంది

కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు సంతోషం వ్యక్తం చేసిన ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ సోరెన్​

Jul 24, 2024 - 15:28
 0
దక్షిణాఫ్రికా నుంచి సురక్షితంగా 27మంది

నా తెలంగాణ,న్యూ ఢిల్లీ: దక్షిణాఫ్రికాలో చిక్కుకుపోయిన ఝార్ఖండ్​ కు చెందిన 27 మందిని కేంద్రప్రభుత్వం, విదేశాంగ శాఖ క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చింది. బుధవారం వీరంతా ఢిల్లీ నుంచి ఝార్ఖండ్​ కు  చేరుకున్నారు. ఝార్ఖండ్​ నుంచి ఉద్యోగాల కోసం దక్షిణాఫ్రికాలోని కామెరూన్​ కు గిరిది, బొకారూ, హజారీబాగ్​ ప్రాంతాలకు చెందిన పలువురు వెళ్లారు. అక్కడికి వెళ్లాక తినడానికి సరిపడా తిండి లేక సరైన పనిచేసినా యాజమాన్యాలు వేతనాలు ఇవ్వక వీరిని నానా ఇబ్బందులు పెట్టాయి. ఇదే విషయాన్ని పలుమార్లు వీరంతా సామాజిక మాధ్యమాల ద్వారా తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో స్పందించిన కేంద్రం వెంటనే వీరిని క్షేమంగా తీసుకువచ్చేందుకు రంగంలోకి దిగింది. 

క్షేమంగా తిరిగి తీసుకువచ్చిన కేంద్ర, రాష్ర్టప్రభుత్వానికి వీరంతా కృతజ్ఞతలు తెలిపారు. వీరి రాక సందర్భంగా సీఎం హేమంత్​ సోరెన్​ సంతోషం వ్యక్తం చేశారు.