పేద విద్యార్థులకు మెడ్వాన్ అండ
Medwan Anda for poor students
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: నిరుపేద అనాథ పిల్లల విద్య కొనసాగించేందుకు మెడ్వాన్ సంస్థ అండగా నిలిచి ఆర్థిక సహాకారం అందుస్తున్నదని ఆ సంస్థ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని మెడ్వాన్ కార్యాలయంలో పేద విద్యార్థులకు చెక్కులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మెడ్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విజయ చిత్ర ఫౌండేషన్, బ్రదర్ అఫ్ గార్బల్ ప్రొవిజన్ వారి సహకారంతో ఆడపిల్లల విద్య కొనసాగించుటకు గత మూడు సంవత్సరాలుగా కరోనా బారిన పడి తల్లిదండ్రులను అనాథలుగా మారిన 15 మంది ఆడపిల్లల విద్యను కొనసాగించుటకు మూడు లక్షల రూపాయలను ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పిల్లల సంరక్షకులు, మెడ్వాన్ సంస్థ కోఆర్డినేటర్ లు ఎంఏ ముజీబ్, స్వప్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.