మార్షల్ ఆర్ట్స్ ‘పటానీ’
ఎంత బలమైన శత్రువు ఎదురొచ్చినా గుణపాఠం చెప్పే తెగువ మగువకు ఉండాలి.
ఎంత బలమైన శత్రువు ఎదురొచ్చినా గుణపాఠం చెప్పే తెగువ మగువకు ఉండాలి. నేటి రోజుల్లో మహిళలకు మార్షల్ విద్యల ఆవశ్యకత చాలా అవసరం. ఇలాంటి విద్యల్లో ఆరితేరిపోయింది దిశా పటానీ. మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో సమానంగా జిమ్ చేసిన దిశా మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో సుశిక్షితులైన కోచ్ ల సమక్షంలో రాటు దేలింది. దిశా తన ఐకానిక్ ఫ్లయింగ్ కిక్‌ల నుండి మర్సాల్ట్‌ల వరకు కేక్‌వాక్ లాగా చేస్తుంది. తన బ్యాక్-టు-బ్యాక్ డ్యాన్స్ సెషన్ల తర్వాత దిశా చివరకు యాక్షన్ మోడ్ లోకి వచ్చి శిక్షణను తిరిగి ప్రారంభించింది. నిజమైన ఫిట్‌నెస్ ఐకాన్ దిశా తన సిగ్నేచర్ బ్యాక్‌ఫ్లిప్‌ను ప్రయత్నిస్తున్న ఓ వీడియోను తాజాగా సోషల్ మీడియల్లో రిలీజ్ చేసింది. ఇది క్షణాల్లో అంతర్జాలాన్ని చుట్టేసింది. ఆపరేషన్ నింజాలో భాగంగా.. తెల్లటి టీ-షర్ట్ -పింక్ షార్ట్‌ను ధరించిన దిశా కార్ట్‌వీల్‌తో ప్రారంభించి ఆపై దానిని బ్యాక్‌ఫ్లిప్‌గా మార్చిన వైనం ఆకట్టుకుంది. కోచ్ తన బ్యాలెన్స్ తప్పకుండా సహకరించారు. ఇలాంటి కష్టమైన ఫీట్ వేయడం అంత సులువేమీ కాదు. శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఫ్లెక్సిబిలిటీతో ఏసింగ్ బ్యాక్‌ఫ్లిప్స్ చేయాల్సి ఉంటుంది. నిజానికి ఇది శక్తిని పెంచుతుంది. ఆబ్స్‌ను బలపరుస్తుంది. కార్ట్‌వీల్స్ ఎల్లపుడూ శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. చేతులు, మణికట్టు, భుజాలు, వెన్నెముక వంటి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. తాజా వీడియోకి క్యాప్షన్‌లో తాను బాలీవుడ్ యాక్షన్ ట్రైనర్ నదీమ్ అక్తర్ వద్ద శిక్షణ పొందుతున్నట్లు దిశా వెల్లడించింది. క్లిప్‌ను షేర్ చేస్తూ దిశా ఇలా రాసింది. `ఏళ్ల తర్వాత శిక్షణ.. నదీమ్ అక్తర్ కోచ్ నింజా`అని ట్యాగ్ ని జోడించింది. ఇంతకుముందే దిశా పటాని కొంత ఎత్తు నుండి బ్యాక్‌ఫ్లిప్‌లను ప్రయత్నిస్తున్న వీడియో వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ క్లిప్‌లో దిశా బ్యాక్‌ఫ్లిప్‌లు, రివర్స్ ఫ్లిప్‌లను అప్రయత్నంగా ప్రయత్నిస్తూ ఆశ్చర్యపరిచింది. మరోసారి క్లిప్‌ను షేర్ చేస్తూ ఇలా వ్యాఖ్యానించింది. `యుగాలు గడిచిన తర్వాత శిక్షణ.. మళ్లీ సాధారణ స్థితికి రావాలి.. మళ్లీ కంబ్యాక్ కోసం వేచి ఉండలేను..` అని రాసింది. దిశా పటానీ ఇన్‌స్టాలో అన్ని రకాల ఫిట్‌నెస్ శిక్షణలకు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో దిశా తన భుజాలపై బార్‌బెల్స్‌తో కూడిన స్క్వాట్‌లను ప్రాక్టీస్ చేస్తోంది. వైవిధ్యంతో పాటు అధిక బరువులతో శిక్షణ పొందుతోంది. గ్లూట్స్ , తొడ కండరాలను బలోపేతం చేయాలనుకుంటే ఈ స్క్వాట్ వేరియేషన్ తప్పనిసరిగా ప్రయత్నించాల్సిన వ్యాయామం. అదనంగా ఇది వశ్యతను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. డంబెల్ స్క్వాట్‌లు అని పిలుచుకునే స్క్వాట్‌లను కూడా దిశా ప్రాక్టీస్ చేస్తోంది. జిమ్‌కు వెళ్లడానికి ప్రారంభంలో ఉన్నవారికి ప్రేరణను అందించడానికి దిశా పటాని గొప్ప స్ఫూర్తి.